Jio phone 5G: త్వరలో జియో ఫోన్‌ 5జీ ఆవిష్కరణ

అందుబాటు ధరలో రిలయన్స్‌ జియో 5జీ ఫోన్‌ ఆవిష్కరణకు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

Published : 14 Dec 2022 08:49 IST

దిల్లీ: అందుబాటు ధరలో రిలయన్స్‌ జియో 5జీ ఫోన్‌ ఆవిష్కరణకు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. 4జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్‌ 480+ ఎస్‌ఓసీ చిప్‌తో వస్తున్న ఈ ఫోన్‌.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) ధ్రువీకరణకు ఉన్న వస్తువుల జాబితాలో తాజాగా కనిపించింది. వివిధ అనుమతులు పొందుతున్న ఈ ఫోన్‌ను.. కంపెనీ త్వరలోనే ఆవిష్కరించే అవకాశం ఉందని అంచనా. గూగుల్‌ సాంకేతిక సాయంతో ఈ ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వచ్చే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఆవిష్కరించొచ్చు. అధికారికంగా ఇప్పటిదాకా ఈ ఫోన్‌ ఫీచర్లు బయటకు రాలేదు. గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌లో ఈ మోడల్‌ నంబరును ఎల్‌ఎస్‌1654క్యూబీ5గా పేర్కొన్నారు. ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌పై నడిచే ఈ ఫోన్‌ తెర 6.5 అంగుళాలు(హెచ్‌డీ+ఎల్‌సీడీ 90 హెర్ట్జ్‌) ఉండొచ్చు. బ్యాటరీ 5000 ఎమ్‌ఏహెచ్‌, వెనక వైపు రెండు 13 ఎమ్‌పీ కెమేరాలు, ముందు 8 ఎమ్‌పీ సెన్సార్‌ ఉండొచ్చని ఆ వార్తా సంస్థ పేర్కొంది. ధర అధికారికంగా తెలియకపోయినప్పటికీ.. రూ.8000-10,000 మధ్య ఉండొచ్చని.. మొత్తంమీద రూ.15,000 మించదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని