Youtubeతో జీడీపీకి రూ.10,000 కోట్లు..7.5 లక్షల ఉద్యోగాలు
Youtube: ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ (Youtube) వల్ల 2021లో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)కి రూ.10,000 కోట్లు పైగా జతయ్యాయి.
దిల్లీ: ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ (Youtube) వల్ల 2021లో భారత స్థూల దేశీయోత్పత్తి(GDP)కి రూ.10,000 కోట్లు పైగా జతయ్యాయి. దేశంలో 7.5 లక్షలకు పైగా పూర్తి స్థాయి ఉద్యోగాలు సైతం ఇది ఇచ్చిందని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ విశ్లేషణ ఆధారంగా తయారు చేసిన ‘యూట్యూబ్ (Youtube) ఇంపాక్ట్ రిపోర్ట్’ అంటోంది. దీని ప్రకారం..
* యూట్యూబ్ (Youtube)లో 4,500కు పైగా ఛానళ్లకు 10 లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు.
* 2021లో ఛానళ్ల వార్షిక ఆదాయం అంతక్రితం ఏడాదితో పోలిస్తే 60 శాతం వృద్ధితో రూ.1 లక్ష కోట్లకు చేరింది.
* ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష, పరోక్ష, ప్రేరిత, ఉత్ప్రేరిత మార్గాల్లో యూట్యూబ్ ప్రభావం కనిపించింది.
* 2021లో కేవలం ఆరోగ్య సంరక్షణ వీడియోల్లోనే 3000 కోట్ల వీక్షణలను యూట్యూబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నారాయణ హెల్త్, మణిపాల్ హాస్పిటల్స్, మేదాంత, షాల్బీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వంటి సంస్థలతో విశ్వసనీయ కంటెంట్‌ను పెంచాలని నిర్ణయించింది.
* ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు యూట్యూబ్ ద్వారా నైపుణ్యాలను పెంచుకున్నారు. కొత్త ఉద్యోగం కావాలనుకునేవారిలో 45% మంది ఉద్యోగ నైపుణ్యాల కోసం యూట్యూబ్‌ను ఆశ్రయిస్తున్నారు.
* సంప్రదాయంగా నేర్చుకునే అంశాలకు అదనపు ప్రయోజనాన్ని అందించే సాధనంగా యూట్యూబ్‌ను విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు.
* యూట్యూబ్ లేదా యూట్యూబ్ కిడ్స్ సహాయంతో తమ పిల్లలు ఏవైనా అంశాలను నేర్చుకోవడాన్ని వినోదంగా భావిస్తున్నారని 83% మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డాయి.
* 76% ఉపాధ్యాయులు సైతం తమ విద్యార్థులకు యూట్యూబ్ ఉపయోగపడుతోందంటున్నారు.
* రోజువారీ జీవితంలో; ఆలోచనలను పంచుకోవడానికి; క్రియేటివ్ పనులు చేయడానికి ఈ ప్లాట్‌ఫాం మద్దతు ఇస్తోందని అధిక శాతం మంది మహిళలు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..