Sundar pichai: సుందర్‌ పిచాయ్‌కు పనితీరు ఆధారిత వేతనం పెంపు

గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌ తన సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు సరికొత్త వేతన విధానాన్ని అమలు చేయడానికి అనుమతి ఇచ్చింది.

Updated : 23 Dec 2022 07:13 IST

గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ ఇంక్‌ తన సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు సరికొత్త వేతన విధానాన్ని అమలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం.. ఆయన వేతనంలో ఎక్కువ భాగాన్ని పనితీరుకు అనుసంధానం చేశారు. ఎస్‌ అండ్‌ పీ 100 కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్‌ వాటాదార్ల ప్రతిఫలం ఆధారంగా పిచాయ్‌ వేతనంలో మరింత మార్పులుంటాయి. సీఈఓగా పిచాయ్‌ ‘బలమైన పనితీరు’ను ప్రదర్శిస్తున్నారని బోర్డు గుర్తించినట్లు ఆల్ఫాబెట్‌ పేర్కొంది. దీని ప్రకారం.. పనితీరు ఆధారిత స్టాక్‌ యూనిట్ల(పీఎస్‌యూ)ను 2019లో ఉన్న 43 శాతం నుంచి 60 శాతానికి సవరించినట్లు తెలిపింది. ప్రతి మూడేళ్లకోసారి పిచాయ్‌కు వేతన సవరణ చేస్తున్నారు. రెండు దశల్లో 63 మిలియన్‌ డాలర్ల చొప్పున లక్ష్యంతో పీఎస్‌యూలను అందించారు. ఆల్ఫాబెట్‌ పరిమిత స్టాక్‌ యూనిట్ల రూపంలోమరో 84 మిలియన్‌ డాలర్లనూ ఆయనకు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని