Aadhar-PAN: మార్చిలోపు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించాలి

వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానించకపోతే అది చెల్లుబాటు కాకుండా పోతుందని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం శనివారం వెల్లడించింది.

Updated : 25 Dec 2022 08:55 IST

లేదంటే చెల్లుబాటులో ఉండదు: ఐటీ విభాగం

దిల్లీ: వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానించకపోతే అది చెల్లుబాటు కాకుండా పోతుందని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం శనివారం వెల్లడించింది. ‘తప్పనిసరిగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలస్యం ఎందుకు? ఈరోజే ఆ పని పూర్తి చేయండ’ంటూ సూచించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్‌ కార్డు కలిగిన వారంతా (మినహాయింపు విభాగంలోని వారు కాకుండా) 2023 మార్చి 31లోగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ఏప్రిల్‌ 1 నుంచి లింక్‌ కాని పాన్‌ కార్డులు చెల్లుబాటులో ఉండ’వని ఐటీ విభాగం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని