రిలయన్స్‌ గూటికి లోటస్‌ చాక్లెట్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోటస్‌ చాక్లెట్ల్‌లో మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్‌) కొనుగోలు చేయనుంది.

Updated : 30 Dec 2022 12:00 IST

దిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోటస్‌ చాక్లెట్ల్‌లో మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్‌) కొనుగోలు చేయనుంది. చాక్లెట్లు, కొకోవా ఉత్పత్తులు, కొకోవా అనుబంధ ఉత్పత్తులను తయారు చేసే లోటస్‌ చాక్లెట్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ల బృందం నుంచి 51% వాటాకు సమానమైన 65.48 లక్షల షేర్లను కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేరుకు రూ.113 సగటు ధరతో, రూ.74 కోట్లు ఇందుకు వెచ్చిస్తుంది. తదుపరి 26 శాతం వాటా (33,38,673 షేర్ల)కు ఓపెన్‌ ఆఫర్‌ను ఆర్‌సీపీఎల్‌ ప్రకటిస్తుంది. ‘దేశీయంగా అభివృద్ధి చేసిన రోజువారీ అత్యున్నత నాణ్యతా ఉత్పత్తులకు ఊతమివ్వాలన్న మా ఉద్దేశాన్ని లోటస్‌లో ఈ పెట్టుబడులు సూచిస్తున్నాయ’ని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈశా అంబానీ పేర్కొన్నారు.

* లోటస్‌ చాక్లెట్‌ సంస్థను 1988లో సినీనటి శారద, విజయ రాఘవన్‌ నంబియార్‌ కలిసి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దౌలతాబాద్‌లో ఈ యూనిట్‌ ఉంది. ప్రస్తుతం సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే సన్‌షైన్‌ అలైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనుబంధ సంస్థగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని