Flat sale: 2023లోనూ ఫ్లాట్‌ల అమ్మకాల జోరు!

అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్ల అమ్మకాలు జోరు 2023లోనూ కొనసాగే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది.

Updated : 06 Jan 2023 08:03 IST

ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం ఉండటం వల్లే: జేఎల్‌ఎల్‌ ఇండియా

దిల్లీ: అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్ల అమ్మకాలు జోరు 2023లోనూ కొనసాగే అవకాశం ఉందని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉండటం ఇందుకు కారణంగా పేర్కొంది. 2022లో ముంబయి, దిల్లీ- ఎన్‌సీఆర్‌, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, పుణె  నగరాల్లో కలిపి మొత్తం 2,15,666 ఫ్లాట్‌లు విక్రయమయ్యాయి. 2021లో విక్రయించిన 1,28,024 ఫ్లాట్లతో పోలిస్తే ఈ సంఖ్య 68 శాతం ఎక్కువ. దశాబ్దకాలంలోనే ఇది గరిష్ఠం కాగా.. 2010లో విక్రయించిన 2,16,762 ఫ్లాట్‌ల తర్వాత ఇవే అధికం.  ఈ ఏడాది కూడా విక్రయాల్లో వృద్ధి కొనసాగొచ్చని జేఎల్‌ఎల్‌ ఇండియా అంచనా వేస్తోంది. దీర్ఘ కాలపరిమితితో కూడిన రుణాలు, అత్యుత్తమ ధరలే, ఫ్లాట్ల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపేలా చేస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ప్రతికూలతలు, తనఖా రేట్లు, స్థిరాస్తి ధరల విలువ పెరిగినప్పటికీ 2022లో ఫ్లాట్‌ల అమ్మకాలు పెరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా హెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (రెసిడెన్షియల్‌ సర్వీసెస్‌) శివ కృష్ణన్‌ తెలిపారు. కొవిడ్‌-19 పరిణామాల అనంతరం ఇళ్లకు గిరాకీ పరిస్థితుల్లో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయని సిగ్నేచర్‌ గ్లోబల్‌ ఛైర్మన్‌ ప్రదీప్‌ అగర్వాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని