టాటా ట్రస్ట్స్‌ సీఈఓగా సిద్ధార్థ్‌ శర్మ

టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌కు కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సిద్ధార్థ్‌ శర్మ (54)ను ప్రకటించారు.

Published : 25 Jan 2023 02:52 IST

సీఓఓగా అపర్ణ ఉప్పలూరి
ఏప్రిల్‌ 1 నుంచి బాధ్యతలు

ముంబయి: టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌కు కొత్త ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా సిద్ధార్థ్‌ శర్మ (54)ను ప్రకటించారు. ఈయన ఇప్పటికే సంస్థలో ముఖ్య స్థిరత్వ అధికారి (సీఎస్‌ఓ)గా కొనసాగుతున్నారు. గతంలో ఈయన 20 ఏళ్లపాటు కేంద్ర ప్రభుత్వ అధికారిగా పలు మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇద్దరు రాష్ట్రపతులకు ఆర్థిక సలహాదారుగానూ వ్యవహరించారు. ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఓఓ)గా అపర్ణ ఉప్పలూరి (48)ని ఎంపిక చేశారు. గత ఏడాది చివర్లో టాటా ట్రస్ట్స్‌ సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఎన్‌.శ్రీనాథ్‌ స్థానంలో సిద్ధార్థ్‌ శర్మ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఉప్పలూరి అపర్ణ ప్రస్తుతం ఫోర్డ్‌ ఫౌండేషన్‌లో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ (భారత్‌, నేపాల్‌, శ్రీలంక)గా ఉన్నారు. కొత్త సీఈఓ, సీఓఓలు 2023 ఏప్రిల్‌ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని