ట్విటర్‌ ప్రధాన కార్యాలయానికి అద్దె కట్టలేదు

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌పై కోర్టుల్లో దావాల పర్వం కొనసాగుతోంది. అమెరికా (శాన్‌ఫ్రాన్సిస్కో)లో కంపెనీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు, బ్రిటన్‌ఓని కార్యాలయాలకూ అద్దె చెల్లించకపోవడంతో, సంబంధిత భవన యజమానులు ట్విటర్‌ యజమాని మస్క్‌ను కోర్టుకు లాగుతున్నారు.

Published : 25 Jan 2023 02:52 IST

భవన యజమానుల దావా

లండన్‌: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్‌పై కోర్టుల్లో దావాల పర్వం కొనసాగుతోంది. అమెరికా (శాన్‌ఫ్రాన్సిస్కో)లో కంపెనీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు, బ్రిటన్‌ఓని కార్యాలయాలకూ అద్దె చెల్లించకపోవడంతో, సంబంధిత భవన యజమానులు ట్విటర్‌ యజమాని మస్క్‌ను కోర్టుకు లాగుతున్నారు. కాలిఫోర్నియా కోర్టు పత్రాల ప్రకారం.. ప్రధాన కార్యాలయ భవనానికి అద్దె చెల్లించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై, ట్విటర్‌ దావాను ఎదుర్కొంటోంది. సెంట్రల్‌ లండన్‌లో కంపెనీ కార్యాలయాల భవనాల అధిపతి కూడా, అద్దె బకాయిల విషయమై ట్విటర్‌ను కోర్టుకు లాగుతానని అంటున్నారు. గతేడాది 44 బిలియన్‌ డాలర్ల భారీ ఒప్పందంతో ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌.. ఏటా 100 కోట్ల డాలర్ల మేర వడ్డీ కట్టాల్సి వస్తోంది. ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కోలో మరో కార్యాలయ అద్దె చెల్లించకపోవడంతో, ఈ నెలలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇక టెస్లా పెట్టుబడుదార్ల నుంచి కూడా మస్క్‌ ఒక క్లాస్‌-యాక్షన్‌ దావాను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని