ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి అదానీ

ప్రపంచ కుబేరుల్లో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ స్థానం ఒకటి తగ్గి, నాలుగుకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన సంపద విలువ 683 మిలియన్‌ డాలర్ల మేర తగ్గడమే ఇందుకు కారణం.

Published : 25 Jan 2023 02:54 IST

మూడో స్థానంలోకి బెజోస్‌
బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల జాబితా

ప్రపంచ కుబేరుల్లో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ స్థానం ఒకటి తగ్గి, నాలుగుకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆయన సంపద విలువ 683 మిలియన్‌ డాలర్ల మేర తగ్గడమే ఇందుకు కారణం. బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల జాబితా ప్రకారం.. భారత్‌, ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అదానీ నికర సంపద విలువ ఈనెల 24కు 120 బిలియన్‌ డాలర్లకు చేరింది. గత 24 గంటల్లో అదానీ 872 మిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ 121 బి.డాలర్ల సంపదతో ఈ జాబితాలో మూడో స్థానానికి చేరారు. ఫ్రాన్స్‌ విలాస ఉత్పత్తుల సంస్థ లూయీ విటోన్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 188 బి.డాలర్ల సంపదతో ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా కొనసాగుతున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (84.7 బి.డాలర్ల సంపద) ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ 500 మంది కుబేరుల రోజువారీ సంపదతో ఈ జాబితాను వెలువరిస్తుంది. న్కూయార్క్‌లో ప్రతిరోజూ ట్రేడింగ్‌ ముగిశాక, ఈ గణాంకాలను సవరిస్తారు. అంటే ఆయా కంపెనీల షేర్ల విలువలకు అనుగుణంగా, అధిపతుల స్థానాలు మారతాయన్న మాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని