బజాజ్‌ ఆటో లాభం రూ.1,473 కోట్లు

బజాజ్‌ ఆటో, అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత పద్ధతిన    రూ.1,473 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Published : 26 Jan 2023 02:32 IST

దిల్లీ: బజాజ్‌ ఆటో, అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత పద్ధతిన    రూ.1,473 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,430 కోట్లతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పెరిగింది. దేశీయంగా అమ్మకాల వృద్ధి ఇందుకు దోహదం చేసింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,022 కోట్ల నుంచి రూ.9,319 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం 9,83,276 వాహనాలు (దేశీయంగా, ఎగుమతులు కలిపి) విక్రయించింది. 2021-22 ఇదే కాలంలో విక్రయించిన 11,81,361 వాహనాలతో పోలిస్తే ఇవి 17% తక్కువ. దేశీయ అమ్మకాలు 5,23,299 నుంచి 4% పెరిగి 5,44,188 వాహనాలకు చేరినా, ఎగుమతులు 6,58,062 నుంచి 33% తగ్గి 4,39,088 వాహనాలకు పరిమితమయ్యాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని