20% పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం

విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈ మూడో త్రైమాసికానికి రూ.250 కోట్ల ఆదాయాన్ని, రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 26 Jan 2023 06:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈ మూడో త్రైమాసికానికి రూ.250 కోట్ల ఆదాయాన్ని, రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.1.58గా నమోదైంది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.208 కోట్లు, నికరలాభం రూ.11 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం దాదాపు 20%, నికరలాభం 4% పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో 142 విద్యుత్తు బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ డెలివరీ చేసినందున, ఆదాయాలు పెరిగాయి.  నాగ్‌పుర్‌, సిల్వాసా, డెహ్రాడూన్‌, సూరత్‌.. తదితర నగరాలకు ఈ బస్సులు సరఫరా చేశారు. ఏడాది క్రితం ఇదేకాలంలో 103 బస్సులను సంస్థ డెలివరీ చేసింది.

9 నెలలకు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు ఒలెక్ట్రా ఆదాయం రూ.776 కోట్లు, నికరలాభం రూ.43  కోట్లు, ఈపీఎస్‌ రూ.5.23 ఉన్నాయి. 2021-22 ఇదే కాల ఆదాయం రూ.317.3 కోట్లతో పోలిస్తే, ఇది 141% అధికమని సంస్థ తెలిపింది.

సరఫరా సవాళ్లను ఎదుర్కొని రాణించాం: అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, కొన్ని త్రైమాసికాలుగా తాము మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కేవీ ప్రదీప్‌ తెలిపారు. తద్వారా ఆదాయాలు, లాభదాయకత పెరుగుతున్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో ఇదేవిధంగా అధిక వృద్ధి నమోదు చేస్తామని తెలిపారు. సమీక్షా త్రైమాసికం చివరకు నికరంగా 3220 బస్సులకు ఆర్డర్లుండగా, వచ్చే మూడు నెలల్లో పెద్ద సంఖ్యలో సరఫరా చేయాల్సి ఉందని ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని