రెండేళ్ల నిషేధం అనంతరం ట్రంప్‌ ఫేస్‌బుక్‌ ఖాతా పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత ఖాతాను రెండేళ్ల నిషేధం అనంతరం ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా పునరుద్ధరించింది.

Published : 27 Jan 2023 01:01 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత ఖాతాను రెండేళ్ల నిషేధం అనంతరం ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా పునరుద్ధరించింది. ఎవరైనా సరే నిబంధనలను తరచు ఉల్లంఘించకుండా సరికొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ‘తమ రాజకీయ నాయకులు ఏం చెబుతారో వినాలని ప్రజలు భావిస్తున్నారు. అది మంచి కావొచ్చు. చెడూ కావొచ్చు. అయితే అది వాస్తవ ప్రపంచానికి ఏదైనా హాని కలిగించే అంశమైతే మెటా కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. భవిష్యత్‌లో కనుక హింసాత్మక అంశాలతో కూడిన కంటెంట్‌ను ట్రంప్‌ పోస్ట్‌ చేస్తే.. దానిని తొలగిస్తాం. తీవ్రతను బట్టి నెల నుంచి రెండేళ్ల పాటు ఖాతాపై మళ్లీ నిషేధం కూడా విధిస్తామ’ని మెటా వైస్‌ ప్రెసిడెంట్‌(అంతర్జాతీయ వ్యవహారాలు) నిక్‌ క్లెగ్‌ స్పష్టం చేశారు. అమెరికాలోని కాపిటల్‌ భవనంలో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని ట్రంప్‌ ప్రశంసించిన నేపథ్యంలో ఆ మరుసటి రోజైన 2021 జనవరి 7న ట్రంప్‌ ఖాతాపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించింది.  అంతక్రితమే ట్రంప్‌ ఖాతా తొలగించాలంటూ సొంత ఉద్యోగుల నుంచీ విజ్ఞప్తులు వచ్చినా, ఫేస్‌బుక్‌ పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని