2024లో భారత్ వృద్ధి 6.7శాతం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం వెలిగిపోతోందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్ వెల్లడించారు.
ఈ ఏడాది 5.8 శాతమే
ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం వెలిగిపోతోందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆర్థికవేత్త హమీద్ రషీద్ వెల్లడించారు. జి20 సభ్య దేశాలతో పోలిస్తే ఇదే అత్యధిక వృద్ధి రేటు అని పేర్కొన్నారు. ఈయన గ్లోబల్ ఎకనమిక్ మానిటరింగ్ బ్రాంచ్, ఆర్థిక విశ్లేషణ, విధాన విభాగం, యూఎన్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు-2023’ నివేదికను విడుదల చేసిన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో భారత జీడీపీ వృద్ధి 5.8 శాతంగా నమోదు కావొచ్చు. అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వంటివి దేశీయ పెట్టుబడులు, ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చు. దక్షిణాసియా దేశాలు అత్యధిక సవాళ్లు ఎదుర్కొంటున్నా, భారత్‌లో ఆర్థిక వృద్ధి బలంగా ఉండనుంది. 2024లో 6.7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందుంది. స్వల్పకాలంలో దేశీయ గిరాకీ బలంగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులు కలిగి ఉంద’ని హమీద్ రషీద్ వివరించారు.
* జి20 (గ్రూప్ ఆఫ్ 20)లో 19 దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్)తో పాటు ఐరోపా సమాఖ్య ఉంది.
పేదరికమూ ఉంది!: భారత్‌లో స్థిరమైన వృద్ధి ఉన్నప్పటికీ గణనీయ సంఖ్యలో ప్రజలు పేదరికంలో జీవనం సాగిస్తున్నారని హమీద్ వెల్లడించారు. ఒకవేళ భారత్ గనుక ఈ వృద్ధి రేటును స్థిరంగా సాధించగలిగితే స్వల్ప కాలంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అంతర్జాతీయంగా పేదరిక తగ్గింపునకు మంచిదని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో భారత్‌లో నిరుద్యోగ రేటు 6.4 శాతానికి దిగి వచ్చిందని, ఇది దేశీయ గిరాకీ బలంగా ఉండటాన్ని సూచిస్తోందని ఆయన వివరించారు.
* ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని, ఈ ఏడాది 5.5 శాతం, 2024లో 5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేస్తున్నట్లు హమీద్ వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్య శ్రేణిలోనే ఉన్నందున, వడ్డీర్లేను మరింత పెంచక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
* భారత్ దిగుమతుల బిల్లు కూడా తగ్గుతోందని, ముఖ్యంగా ఇంధన దిగుమతి వ్యయం గత కొన్నేళ్లతో పోస్తే బాగా తగ్గిందని 2022, 2023లో వృద్ధి అవకాశాలు మెరుగవ్వడానికి ఇది కూడా దోహదం చేసిందని హమీద్ రషీద్ వెల్లడించారు.
* సమీప కాలంలో భారత్ వృద్ధి అవకాశాలపై అధిక వడ్డీ రేట్లు ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ గిరాకీ నెమ్మదించడం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించొచ్చన్నారు. ఐరోపా, అమెరికాల్లో వృద్ధి రేటు నెమ్మదిస్తే భారత్‌కు నష్టం కలగొచ్చని తెలిపారు.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో అంచనా వేసిన 3 శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు కావొచ్చని, 2023లో ఇది 1.9 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల కొన్ని దశాబ్దాల్లోనే ఇది అత్యల్ప వృద్ధి రేటు అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?
-
General News
Tamilisai soundararajan: శ్రీరాముడి పట్టాభిషేకానికి రైలులో భద్రాచలానికి బయలుదేరిన గవర్నర్