అమెరికా విపణిలోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కంటి ఔషధం

కంటి శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ వల్ల కళ్లలో వచ్చే నొప్పి, వాపు చికిత్సలో ఉపయోగించే డిఫ్లుప్రెడ్‌నేట్‌ ఆప్తాల్మిక్‌ ఎమల్షన్‌ను అమెరికా మార్కెట్లో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ విడుదల చేసింది.

Published : 28 Jan 2023 02:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: కంటి శస్త్రచికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్‌, అలర్జీ వల్ల కళ్లలో వచ్చే నొప్పి, వాపు చికిత్సలో ఉపయోగించే డిఫ్లుప్రెడ్‌నేట్‌ ఆప్తాల్మిక్‌ ఎమల్షన్‌ను అమెరికా మార్కెట్లో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ విడుదల చేసింది. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన తర్వాత డ్యూరెజోల్‌ (డిఫ్లుప్రెడ్‌నేట్‌ ఆప్తాలిక్‌ ఎమల్షన్‌ 0.05 శాతం) జనరిక్‌ వెర్షన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యూరోజోల్‌ బ్రాండు, జెనరిక్స్‌ ఔషధ విక్రయాలు గత ఏడాది నవంబరుతో ముగిసిన 12 నెలల కాలానికి 40 మిలియన్‌ డాలర్ల మేర జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని