బొగ్గు గనుల రాళ్ల నుంచి ఇసుక

ఉపరితల బొగ్గు గనుల తవ్వకాల్లో భాగంగా వెలికి తీసిన మట్టి, రాళ్ల (ఓవర్‌బర్డెన్‌ రాక్స్‌) నుంచి ఇసుకను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్‌ ఇండియా (సీఐఎల్‌) భావిస్తోంది.

Published : 28 Jan 2023 02:13 IST

కోల్‌ ఇండియా ప్రతిపాదనలు
వచ్చే ఏడాదికల్లా 5 ప్లాంట్లు

దిల్లీ: ఉపరితల బొగ్గు గనుల తవ్వకాల్లో భాగంగా వెలికి తీసిన మట్టి, రాళ్ల (ఓవర్‌బర్డెన్‌ రాక్స్‌) నుంచి ఇసుకను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్‌ ఇండియా (సీఐఎల్‌) భావిస్తోంది. దీనికోసం వచ్చే ఏడాది నాటికి అయిదు ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ‘ఓవర్‌బర్డెన్‌ రాక్స్‌ నుంచి ఇసుక ఉత్పత్తి’ కింద కోల్‌ ఇండియా దాని ఉపరితల గనుల వద్ద నిరుపయోగంగా ఉన్న మట్టి, రాళ్లను పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో 60 శాతం మేరకు ఇసుక రాయి ఉంటుంది. దీనిని క్రషింగ్‌, ప్రాసెసింగ్‌ ద్వారా ఇసుకను ఉత్పత్తి చేస్తుందని శుక్రవారం బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయిదు ప్లాంట్లలో బల్లార్‌పూర్‌ ప్లాంట్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌లో మే నాటికి ఇసుక ఉత్పత్తి కానుంది. మిగతా నాలుగు ప్లాంట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పేర్కొంది. రోడ్లు, రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి భూమిని చదును చేయడానికీ ఉపరితల గనుల తవ్వకాల్లో వెలికి తీసిన మట్టి, రాళ్లను వినియోగిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు