జియో, ఎయిర్‌టెల్‌ ఖాతాదారులు పెరిగారు

గతేడాది నవంబరులో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా 25 లక్షల మంది ఖాతాదారులను చేర్చుకున్నాయి.

Published : 28 Jan 2023 02:14 IST

18 లక్షల మందిని కోల్పోయిన వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: గతేడాది నవంబరులో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా 25 లక్షల మంది ఖాతాదారులను చేర్చుకున్నాయి. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 18.3 లక్షల చందాదారులను కోల్పోయిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. రిలయన్స్‌ జియో 14.26 లక్షలు, ఎయిర్‌టెల్‌ 10.56 లక్షల ఖాతాదారులను సంపాదించాయి. నవంబరుకు జియో ఖాతాదారుల సంఖ్య 42.13 కోట్ల నుంచి 42.28 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్‌ ఖాతాదారుల సంఖ్య 36.60 కోట్లుగా ఉంది. వొడాఫోన్‌ ఐడియా 18.27 లక్షల మందిని కోల్పోయి 24.37 కోట్లకు పరిమితమైంది.

మొత్తం బ్రాడ్‌బ్యాండ్‌ ఖాతాదారుల సంఖ్య 82.53 కోట్లకు పెరిగింది. నెలవారీ వృద్ధి రేటు 0.47 శాతంగా ఉంది.

అగ్రగామి 5 సర్వీస్‌ ప్రొవైడర్ల చేతిలోనే 98 శాతానికి పైగా మార్కెట్‌ వాటా ఉంది. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ (43.01 కోట్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (23.05 కోట్లు), వొడాఫోన్‌ ఐడియా (12.34 కోట్లు), బీఎస్‌ఎన్‌ఎల్‌ (2.58 కోట్లు) ఖాతాదారులు ఉన్నారు.

వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీల్లో రిలయన్స్‌ జియో (73.8 లక్షలు), ఎయిర్‌టెల్‌ (55.6 లక్షలు), బీఎస్‌ఎన్‌ఎల్‌ (40.2 లక్షలు) ముందంజలో ఉన్నాయి.

మొత్తం వైర్‌లెస్‌ వినియోగదారుల సంఖ్య 114.36 కోట్ల నుంచి 114.30 కోట్లకు తగ్గింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని