ఎన్‌ఎండీసీ ప్రచారకర్తగా నిఖత్‌ జరీన్‌

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు ప్రచారకర్త(బ్రాండ్‌ అంబాసిడర్‌)గా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వ్యవహరించనున్నారు.

Published : 29 Jan 2023 02:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌కు ప్రచారకర్త(బ్రాండ్‌ అంబాసిడర్‌)గా బాక్సింగ్‌ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వ్యవహరించనున్నారు. ధైర్య సాహసాలు, శక్తి, చురుకుదనం గల క్రీడాకారిణి అయిన నిఖత్‌ జరీన్‌ దేశ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఎన్‌ఎండీసీ బ్రాండును ఎంతగానో ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడతారని ఆశిస్తున్నట్లు సంస్థ సీఎండీ సుమిత్‌ దేబ్‌ పేర్కొన్నారు. వచ్చే ఒలింపిక్‌ క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న ఆమెకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని