సంక్షిప్త వార్తలు (3)
వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు)ను ప్రైవేటీకరించే అవకాశం లేదని తెలుస్తోంది.
కొత్తగా సీపీఎస్‌ఈల ప్రైవేటీకరణ ఉండకపోవచ్చు!
గతంలో ప్రకటించిన వాటినే 2023-24లో పూర్తి చేయొచ్చు
దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు)ను ప్రైవేటీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన సీపీఎస్‌ఈల ప్రైవేటీకరణ ప్రక్రియను మాత్రం పూర్తి చేయొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని వాస్తవికంగా ఉండేలా చూసుకోవచ్చని సమాచారం. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోలేకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ప్రభుత్వం రూ.65,000 కోట్ల నిధుల్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని గత బడ్జెట్‌లో నిర్దేశించుకుంది. కాగా ఇప్పటి వరకు కేవలం రూ.31,106 కోట్లను మాత్రమే సమీకరించింది. ప్రభుత్వ రంగ కంపెనీల్లో మైనార్టీ వాటాలు విక్రయించడం ద్వారా ఈ నిధుల్ని రాబట్టింది. 2021లో నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను విజయవంతంగా ప్రైవేటీకరించినా, గత ఏడాది మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో పీఎస్‌యూల విక్రయాలు చోటు చేసుకోలేదు.
* ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ జరిగే అవకాశాలున్న కంపెనీలు ఇవే: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎండీసీ స్టీల్ లిమిటెడ్, బీఈఎంఎల్, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్‌ఐఎన్‌ఎల్/వైజాగ్ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్.
మూలధన లాభాల పన్ను హేతుబద్ధీకరించాలి
ఐటీఆర్ ఫామ్ సులువుగా ఉండాలి: నిపుణులు
దిల్లీ: రాబోయే బడ్జెట్‌లో మూలధన లాభాల పన్నును హేతుబద్ధీకరించాలని నిపుణులు కోరుతున్నారు. అలాగే అలాంటి ఆదాయ నమోదుకు ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్) ఫామ్ కూడా సులువుగా ఉండేలా చూడాలని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్ను లేదా డివిడెండ్ లేదా వడ్డీ ఆదాయం మాత్రమే కలిగిన పన్ను చెల్లింపుదార్లకు ఫామ్‌లు సులువుగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మూలధన ఆస్తులను (స్థిర, చరాస్తులు) బదిలీ చేయడం ద్వారా పొందే లాభాలను ‘క్యాపిటల్ గెయిన్స్’ (మూలధన లాభాలు)గా భావించి పన్ను విధిస్తుంటారు. దేశంలోని క్యాపిటల్ మార్కెట్లు విపరీతమైన వేగంతో పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓలు) ద్వారా నిధులు సమీకరించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మూలధన లాభాల పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
రుణ హామీ పథకం కింద గో ఫస్ట్‌కు రూ.210 కోట్లు
ముంబయి: ప్రభుత్వ రుణ హామీ పథకం కింద వచ్చే నెలలో రూ.210 కోట్లు అందుకునే అవకాశం ఉందని వాడియా గ్రూప్ సంస్థ గో ఫస్ట్ భావిస్తోంది. ఆర్థిక పరిస్థితి బలోపేతానికి, కార్యకలాపాల విస్తరణ కోసం గో ఫస్ట్ ఈ నిధులను ఆశిస్తోంది. గత వారం సంస్థ ప్రమోటర్ల నుంచి రూ.210 కోట్లు అందాయని, ఈ ఏడాది ఏప్రిల్‌కు విమానాలను 53కు పెంచుకోవడమే లక్ష్యమని గో ఫస్ట్ సీఈఓ కౌశిక్ ఖోనా పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 37 విమానాలు ఉన్నాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ సమస్యలతో కంపెనీ ఇబ్బందులు పడుతోంది. అదనపు ఇంజిన్‌ల కొరత వల్ల పలు విమానాలు నిలిచిపోయాయి. కరోనా వల్ల ప్రభావితమైన రంగాల కోసం తీసుకొచ్చిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్) కింద ఇప్పటివరకు గోఫస్ట్ రూ.600 కోట్ల రుణం పొందింది. ఇంజిన్ సమస్యలు క్రమంగా తగ్గుతున్నాయని, ఏప్రిల్‌కు ప్రాట్ అండ్ విట్నీ నుంచి 20 కొత్త ఇంజిన్‌లు రావొచ్చని ఖోనా వెల్లడించారు. వీటితో 10 విమానాలు నిర్వహణలోకి వస్తాయన్నారు. 2023-24లో ప్రయాణికుల సంఖ్యలో 57 శాతం వృద్ధిని గోఫస్ట్ ఆశిస్తోందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/03/2023)
-
Sports News
Umesh Yadav: అదే నా చివరి టోర్నీ.. ఛాన్స్‌ను మిస్ చేసుకోను: ఉమేశ్ యాదవ్
-
India News
Rajasthan: వారంతా నిర్దోషులే.. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!
-
Movies News
Allari Naresh: నాకు అలాంటి కామెడీ ఇష్టం.. అల్లరి నరేశ్‌కి అనిల్ రావిపూడి తోడైతే!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Crime News
IPS Officer: విచారణలో మర్మాంగాలపై దాడి.. ఐపీఎస్ అధికారిపై వేటు!