ప్రపంచ అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నిలిచింది.
వరుసగా నాలుగో ఏడాదీ..
దిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే అతి పెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నిలిచింది. 2022లో ట్రేడయిన మొత్తం డెరివేటివ్ కాంట్రాక్టుల సంఖ్య ఆధారంగా ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్‌ఐఏ) ఈ ర్యాంకుల్ని ఇస్తుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఈక్విటీ విభాగంలోనూ ట్రేడ్ల సంఖ్య (ఎలక్ట్రానిక్ ఆర్డర్ బుక్) ఆధారంగా 2022లో ఎన్‌ఎస్‌ఈకి మూడో స్థానం లభించింది. గత ఏడాది మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపడింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజీస్ (డబ్ల్యూఎఫ్‌ఈ) ఈ గణాంకాలను నిర్వహిస్తుంటుంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో నిఫ్టీ 50 జీవన కాల గరిష్ఠమైన 18,887.60 పాయింట్లను తాకింది.
* ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్‌ల్లో (ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్స్) రోజువారీ సరాసరి టర్నోవర్ రూ.470 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 51 శాతం వృద్ధి చెందింది.
* సార్వభౌమ పసిడి బాండ్ల రోజువారీ సరాసరి టర్నోవర్ (సెకండరీ మార్కెట్‌లో) రూ.7 కోట్లుగా నమోదైంది. 59 శాతం వృద్ధి లభించింది.
* ప్రభుత్వ సెక్యూరిటీల రోజువారీ సరాసరి టర్నోవర్ గత నెలలో రూ.3 కోట్లకు చేరింది.* ఈక్విటీ విభాగంలో మూడో స్థానం, డెరివేటివ్స్ విభాగంలో అతి పెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించడం వాటాదార్లందరి సహకారంతోనే సాధ్యమైందని ఎన్‌ఎస్‌ఈ హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు.
* నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాగానే సామాజిక స్టాక్ ఎక్స్ఛేంజీను కూడా ఒక విభాగంగా త్వరలోనే ప్రారంభిస్తామని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్‌లో 11 మంది మృత్యువాత
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
Sports News
ధోనీకి కెప్టెన్‌గా కొంచెం కష్టపడ్డా: స్టీవ్ స్మిత్
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా