పసిడిలో లాభాల స్వీకరణ!

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.57,389 స్థాయిని అధిగమిస్తే రూ.57,592 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Published : 30 Jan 2023 01:10 IST

కమొడిటీస్‌ఈ వారం

బంగారం

సిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.57,389 స్థాయిని అధిగమిస్తే రూ.57,592 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనినీ మించితే రూ.57,749 వరకు రాణిస్తుందని భావించవచ్చు. ఒకవేళ రూ.57,029 కంటే కిందకు వస్తే రూ.56,872; రూ.56,669 వరకు దిద్దుబాటు కావచ్చు. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు అధిక స్థాయిల వద్ద లాభాలను స్వీకరించడం లేదంటే.. రూ.57,026 సమీపంలో స్టాప్‌లాస్‌ను పెట్టుకోవడం మంచిది. ఈవారంలో జరిగే అమెరికా ఫెడ్‌ సమావేశంలో తీసుకునే నిర్ణయాలూ పసిడి కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి.

ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం రూ.15,798 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.15,729 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.  


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.67,550 కంటే కిందకు వస్తేనే దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు నేడు     రూ.791 స్థాయిని నిలబెట్టుకుంటే.. రూ.794; రూ.798 వరకు రాణిస్తుందని భావించవచ్చు. ఒకవేళ రూ.775 కంటే కిందకు వస్తే.. ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంటుంది.

సీసం ఫిబ్రవరి కాంట్రాక్టుకు రూ.188 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని రూ.190 ఎగువన లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.187 దిగువకు వస్తే షార్ట్‌ సెల్‌ వైపు మొగ్గు చూపొచ్చు.

జింక్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సాంకేతికంగా మరింత కిందకు దిగివచ్చే అవకాశం ఉంది. రూ.305.60 కంటే ఎగువన కదలాడకుంటే.. రూ.293 వరకు పడిపోవచ్చు.

అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.222 కంటే పైన కదలాడితే.. లాంగ్‌పొజిషన్ల వైపు మొగ్గుచూపొచ్చు. ఒకవేళ ఈ స్థాయి కంటే కిందకు వస్తే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.


ఇంధన రంగం


 

ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.6,676 కంటే పైన కదలాడకుంటే.. రూ.6,469; రూ.6,396 వరకు పడిపోవచ్చు. ఒకవేళ రూ.6,676ను మించితే  రూ.6,693;రూ.6,735 వరకు రాణిస్తుంది.

సహజవాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూలంగా చలిస్తే రూ.265 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.277 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వస్తే రూ.234 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.214కు పడిపోతుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.7,346 కంటే దిగువన కదలాడకుంటే.. రెండు వారాల గరిష్ఠమైన రూ.7,840 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం కిందకు వస్తే రూ.30,625 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.29,466 వరకు పడిపోతుందని భావించవచ్చు.

ధనియాలు ఏప్రిల్‌ కాంట్రాక్టుకు ఈవారం కూడా అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని