టెక్‌ మహీంద్రా లాభం రూ.1297 కోట్లు

డిసెంబరు త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం 5.3 శాతం తగ్గి రూ.1,297 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,378.20 కోట్లు కావడం గమనార్హం ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.11,451 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.13,734.60 కోట్లకు చేరింది.

Published : 31 Jan 2023 02:35 IST

దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా ఏకీకృత నికర లాభం 5.3 శాతం తగ్గి రూ.1,297 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,378.20 కోట్లు కావడం గమనార్హం ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.11,451 కోట్ల నుంచి 20 శాతం పెరిగి రూ.13,734.60 కోట్లకు చేరింది. వేతనాల పెంపు, సరఫరా ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ మార్జిన్లు తగ్గడం, లాభంపై ప్రభావం చూపిందని ముఖ్య ఆర్థిక అధికారి రోహిత్‌ ఆనంద్‌ తెలిపారు. మార్జిన్లు 14.8% నుంచి 12 శాతానికి తగ్గాయి. 2022-23 చివరికి 14 శాతం మార్జిన్‌ లక్ష్యాన్ని సాధించడం కష్టంగానే ఉండొచ్చన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు. టెక్‌ మహీంద్రా ఉద్యోగుల సంఖ్య 1800 తగ్గి 1.57 లక్షలకు పరిమితమైంది. బీపీఓ సేవల సిబ్బందిని తగ్గించుకోవడమే ఇందుకు కారణమంది. వలసల రేటు 17 శాతానికి పరిమితమైంది.  సమీక్షా త్రైమాసికంలో టెక్‌ మహీంద్రా 795 మిలియన్‌ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు