అమ్ముడుపోని గృహ నిల్వలు తగ్గాయ్‌

దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో, అమ్ముడుపోని గృహ నిల్వలు గత డిసెంబరుకు 10 శాతం  4,61,600 యూనిట్లకు పరిమితమయ్యాయని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది.

Published : 31 Jan 2023 02:35 IST

హైదరాబాద్‌లో 84,545కు పరిమితం: ప్రాప్‌ఈక్విటీ  

దిల్లీ: దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో, అమ్ముడుపోని గృహ నిల్వలు గత డిసెంబరుకు 10 శాతం  4,61,600 యూనిట్లకు పరిమితమయ్యాయని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. 2022 సెప్టెంబరు త్రైమాసికం చివరకు అమ్ముడుపోని గృహ నిల్వలు 5,12,526గా ఉన్నాయి. హైదరాబాద్‌లో చూస్తే నిల్వలు 93,473 నుంచి 84,545కు పరిమితమయ్యాయి. ‘పలు సవాళ్లు ఉన్నప్పటికీ గతేడాది గృహ విక్రయాలు బలంగా పుంజుకున్నాయి. పరిశ్రమలో గిరాకీని, సానుకూల సెంటిమెంట్‌ వృద్ధి చెందడాన్ని ఇది సూచిస్తోంది. గృహ రుణ రేట్లు పెరుగుతున్నప్పటికీ, ఆస్తుల విలువ పెరగొచ్చన్న అంచనాలతో, వినియోగదారులు కొనుగోళ్లకు ముందుకొస్తున్నారు’ అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్‌ జసుజా పేర్కొన్నారు. పలు నగరాల్లో నిల్వలు ఇలా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని