రుణ పెట్టుబడులే అధికం

దేశీయ కంపెనీలు గత ఏడాది ఏప్రిల్‌- నవంబరులో రూ.5.06 లక్షల కోట్ల ఈక్విటీ, రుణ పెట్టుబడులు సమీకరించాయి.

Published : 01 Feb 2023 04:18 IST

రూ.5.06 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు

దేశీయ కంపెనీలు గత ఏడాది ఏప్రిల్‌- నవంబరులో రూ.5.06 లక్షల కోట్ల ఈక్విటీ, రుణ పెట్టుబడులు సమీకరించాయి. 2021 ఇదేకాలంలో సమీకరించిన రూ.5.53 లక్షల కోట్లతో పోల్చితే ఇవి 8.5% తక్కువ. రూ.5.06 లక్షల కోట్లలో రూ.3.92 లక్షల కోట్లు రుణ పెట్టుబడులు కాగా, రూ.1.14 లక్షల కోట్లు మాత్రమే ఈక్విటీ పెట్టుబడుల రూపంలో లభించాయి. 2021లో రుణ పెట్టుబడులు రూ.3.71 లక్షల కోట్లు కాగా, ఈక్విటీ పెట్టుబడులు రూ.1.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) ల ద్వారా సమీకరించిన రూ.89,166 కోట్లు కూడా కలిసి ఉన్నాయి.

మన స్టాక్‌మార్కెట్లు మెరుగే

ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, స్టాక్‌మార్కెట్ల తీరుతెన్నులను పరిగణనలోకి తీసుకుంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మన స్టాక్‌మార్కెట్లు మెరుగ్గానే ఉన్నట్లు సర్వే అభిప్రాయపడింది. గత ఏడాది మే నెలలో జరిగిన ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ దేశీయంగా అతిపెద్దది. ప్రపంచ వ్యాప్తంగా ఆరో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా నిలుస్తుంది.  చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) అధికంగా పబ్లిక్‌ ఇష్యూలు చేయడం, పెద్దఎత్తున నిధులు సమీకరించడం 2022-23 లో మరొక ప్రత్యేకత. 2021-22తో పోల్చితే ఎస్‌ఎంఈ సంస్థల ఐపీఓలు రెట్టింపు కావటంతో పాటు, ఈ సంస్థలు మూడింతలు అధికంగా నిధులు సమీకరించగలిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని