సన్‌ ఫార్మా లాభం రూ.2,166 కోట్లు

సన్‌ ఫార్మా డిసెంబరు త్రైమాసికంలో రూ.2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.2,059 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ.

Published : 01 Feb 2023 04:18 IST

మధ్యంతర డివిడెండ్‌ రూ.7.50

దిల్లీ: సన్‌ ఫార్మా డిసెంబరు త్రైమాసికంలో రూ.2,166 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.2,059 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. కార్యకలాపాల మొత్తం ఆదాయం రూ.9,863 కోట్ల నుంచి రూ.11,241 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్‌ విక్రయాలు 7 శాతం పెరిగి రూ.3,392 కోట్లకు చేరాయి. యూఎస్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 6 శాతం పెరిగి 422 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3,400 కోట్లు)కు చేరాయి. ‘సన్‌ ఫార్మా వృద్ధిలో కీలకమైన స్పెషాల్టీ వ్యాపారాన్ని విస్తరించేందుకు, థెరపీ విభాగాల్లో పెట్టుబడులు పెడుతున్నాం. అమెరికాకు చెందిన కన్సర్ట్‌ ఫార్మా కొనుగోలు కూడా ఈ దిశగా వేసిన అడుగే’ అని సన్‌ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ సంఘ్వి వెల్లడించారు. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.7.50 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

* బీఎస్‌ఈలో షేరు 1.51 శాతం నష్టపోయి రూ.1,035 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని