పాన్‌తో మరింత సులువుగా వ్యాపారం

శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను ఇకపై నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల, అన్ని డిజిటల్‌ ఏజెన్సీలు కూడా గుర్తింపు కార్డుగా అనుమతించనున్నాయి.

Published : 02 Feb 2023 03:11 IST

శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను ఇకపై నిర్దిష్ట ప్రభుత్వ ఏజెన్సీల, అన్ని డిజిటల్‌ ఏజెన్సీలు కూడా గుర్తింపు కార్డుగా అనుమతించనున్నాయి. వ్యక్తి, సంస్థలకు ఆదాయ పన్ను(ఐటీ) విభాగం 10 అంకెలు, అక్షరాలతో కూడిన పాన్‌ జారీ చేస్తోంది. ప్రస్తుతం 13 రకాల ధ్రువీకరణలను వ్యాపార సంస్థలు చూపుతున్నాయి.

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఊతంగా: ఒక వేళ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు కాంట్రాక్టును పూర్తి చేయడంలో విఫలమైన పక్షంలో, వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద పర్ఫామెన్స్‌ సెక్యూరిటీలో 95 శాతాన్ని వెనక్కి ఇస్తారు. పన్ను, వడ్డీలు, అపరాధ రుసుముల మదింపులో ఏర్పడే వివాదాల్లో వివాద్‌ సే విశ్వాస్‌ ద్వారా సెటిల్‌మెంట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

* మూడో దశ ఇ-కోర్టులను ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని