జనవరిలోనూ వాహన దూకుడు

కొత్త సంవత్సరం తొలి నెలలోనూ వాహన విక్రయాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా జనవరిలో 1,72,535 వాహనాలను టోకుగా విక్రయించింది.

Published : 02 Feb 2023 03:11 IST

ముంబయి: కొత్త సంవత్సరం తొలి నెలలోనూ వాహన విక్రయాలు పుంజుకున్నాయి. మారుతీ సుజుకీ ఇండియా జనవరిలో 1,72,535 వాహనాలను టోకుగా విక్రయించింది. 2022 జనవరిలో అమ్మిన 1,54,379 వాహనాలతో పోలిస్తే ఇది 12% ఎక్కువ. టయోటా విక్రయాల్లో 175% వృద్ధి నమోదైంది. కియా ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా వరుసగా 48%, 37% చొప్పున వృద్ధి నమోదు చేశాయి. వాణిజ్య వాహన విభాగంలో అశోక్‌ లేలాండ్‌ 23% వృద్ధి నమోదు చేసింది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో విక్రయాలు 21% తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని