ద్రవ్యలోటు లక్ష్యం 5.9%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ద్రవ్యలోటు లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయకుండా జీడీపీలో 6.4 శాతం (రూ.16,61,196 కోట్లు)గా కొనసాగించారు.

Published : 02 Feb 2023 03:11 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ద్రవ్యలోటు లక్ష్యంలో ఎటువంటి మార్పు చేయకుండా జీడీపీలో 6.4 శాతం (రూ.16,61,196 కోట్లు)గా కొనసాగించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24) 5.9 శాతానికి తగ్గిస్తామని, 2025-26  కల్లా ద్రవ్యలోటును 4.5 శాతం దిగువకు తేవాలన్నది ప్రణాళికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వ్యయాలు, ఆదాయాల వ్యత్యాసమైన ద్రవ్యలోటును  2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.16,61,196 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22కు ద్రవ్యలోటు 6.9 శాతమని తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు 6.8 శాతంగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల ఆదాయం రూ.23.3 లక్షల కోట్లుగా ఉండొచ్చని మంత్రి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు