సుబ్రతా రాయ్‌ బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌

సహారా గ్రూప్‌ అధిపతి సుబ్రతా రాయ్‌, మరో ముగ్గురికి చెందిన బ్యాంకు-డీమ్యాట్‌ల ఖాతాలను అటాచ్‌ చేయాలంటూ మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.

Published : 02 Feb 2023 03:11 IST

సెబీ ఆదేశాలు

దిల్లీ: సహారా గ్రూప్‌ అధిపతి సుబ్రతా రాయ్‌, మరో ముగ్గురికి చెందిన బ్యాంకు-డీమ్యాట్‌ల ఖాతాలను అటాచ్‌ చేయాలంటూ మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు డిబెంచర్ల (ఓఎఫ్‌సీడీ) జారీలో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిననందుకు గాను విధించిన రూ.6.48 కోట్ల అపరాధ రుసుమును రికవరీ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సుబ్రతా రాయ్‌తో పాటు అశోక్‌ రాయ్‌ఛౌదరి, రవి శంకర్‌ దూబే, వందన భార్గవకు చెందిన బ్యాంకు, డీమ్యాట్‌ ఖాతాలను అటాచ్‌ చేయనున్నారు. ఈ నలుగురి అన్ని ఖాతాలను (లాకర్లు సహా) అటాచ్‌ చేయాలని సెబీ పేర్కొంది. వీరి ఖాతాల నుంచి ఎటువంటి ఉపసంహరణలు జరగరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్‌ ఫండ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయా ఖాతాల్లో జమలకు మాత్రం అనుమతినిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు