విదేశీ పర్యటనలకు టీసీఎస్‌ 20 శాతానికి పెంపు

విదేశీ పర్యటనల ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలును (టీసీఎస్‌) 20 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది.

Published : 02 Feb 2023 03:15 IST

విదేశీ పర్యటనల ప్యాకేజీలపై మూలం వద్ద పన్ను వసూలును (టీసీఎస్‌) 20 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. విదేశాలకు రూ.7 లక్షలకు మించి నిధులు పంపితే కూడా 20 శాతం టీసీఎస్‌ వర్తిస్తుంది. 2023-24 బడ్జెట్‌ ద్వారా ఆదాయపు పన్ను చట్టం 206సీ సెక్షన్‌లో ద్రవ్యబిల్లు సవరణలు చేసింది. ఈ సవరణలు 2023 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. విదేశీ మారకపు నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ టీసీఎస్‌ను 20 శాతానికి పెంచడం ఆశ్చర్యకరమని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు