Income tax: ‘సీఎస్‌ఆర్‌’ వస్తు, సేవలపై ఐటీఆర్‌ క్లెయిమ్‌ చేసుకోవద్దు

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల కోసం ఉపయోగించే లేదంటే ఉపయోగించాలని అనుకునే వస్తువులు, సేవలపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసుకోకూడదని ప్రభుత్వం తెలిపింది.

Updated : 02 Feb 2023 09:56 IST

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాల కోసం ఉపయోగించే లేదంటే ఉపయోగించాలని అనుకునే వస్తువులు, సేవలపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను క్లెయిమ్‌ చేసుకోకూడదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జీఎస్‌టీ చట్టంలో సవరణలను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జీఎస్‌టీ చట్టం కింద కొన్ని నేరాలను క్రిమినల్‌ నేరం కింద మినహాయింపు ఇచ్చేందుకు, విచారణ అర్హత పరిమితిని రూ.2 కోట్లకు (మోసం విలువ) పెంచేందుకు కూడా సవరణలను ప్రతిపాదించారు. నకిలీ రశీదులకు విచారణ పరిమితిని రూ.1 కోటిగానే కొనసాగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని