పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.51,000 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.65,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు కుదించింది.

Updated : 02 Feb 2023 13:33 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.65,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు కుదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.51,000 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా (మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీట్స్‌)ను రూ.65,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లుగా మార్చారు. అందులో రూ.50,000 కోట్లు పెట్టుబడుల ఉపంసహరణ ద్వారా రూ.10,000 కోట్లను ఆస్తుల నగదీకరణ ద్వారా సాధిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికీ మిస్‌లేనియస్‌ క్యాపిటల్‌ రిసీట్స్‌ను రూ.61,000 కోట్లుగా నిర్దేశించుకోగా.. ఇందులో రూ.51,000 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, రూ.10,000 కోట్లను ఆస్తుల నగదీకరణ ద్వారా సాధించాలన్న తలంపులో ఉంది. వచ్చే ఏడాది షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎమ్‌డీసీ స్టీల్‌, బీఈఎమ్‌ఎల్‌, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వైజాగ్‌ స్టీల్‌లు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని