శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23

ప్రీమియం గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ ఫోన్లను స్థానిక విపణి అవసరాల మేరకు భారత్‌లోనే తయారు చేస్తామని దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగ్‌ గురువారం వెల్లడించింది.

Updated : 03 Feb 2023 04:08 IST

ధరల శ్రేణి రూ.74,999-1,54,999
దేశీయంగా తయారీకి సంస్థ నిర్ణయం

దిల్లీ: ప్రీమియం గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ ఫోన్లను స్థానిక విపణి అవసరాల మేరకు భారత్‌లోనే తయారు చేస్తామని దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగ్‌ గురువారం వెల్లడించింది. దేశీయంగా ఈ ఫోన్లు రూ.74,999-1,54,999 ధరల శ్రేణిలో లభిస్తాయంది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లను శామ్‌సంగ్‌ వియత్నాం ఫ్యాక్టరీలో తయారు చేసి, భారత్‌లో విక్రయించేందుకు దిగుమతి చేసుకుంటోంది. ‘వీటిని నొయిడా ఫ్యాక్టరీలో తయారు చేయనున్నాం. భారతలో తయారీ, వృద్ధిపై మాకున్న విశ్వాసం దీన్ని బట్టి అర్థమవుతుంద’ని శామ్‌సంగ్‌ తెలిపింది.
* శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23 స్మార్ట్‌ ఫోన్లలో 3 మోడళ్లున్నాయి. ఎలాంటి వెలుగులో అయిన చిత్రాలు స్పష్టంగా తీసేందుకు అనువుగా 12-200 మెగాపిక్సెల్‌ హై-ఎండ్‌ కెమెరా సెన్సార్లు అమర్చినట్లు సంస్థ తెలిపింది. 100 మెగాపిక్సెల్‌ కెమేరా కలిగిన గెలాక్సీ ఎస్‌22 స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఎస్‌23 సిరీస్‌ ఫోన్ల ధరలు 2.7-30 శాతం పెంచింది. గెలాక్సీ ఎస్‌22 స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ.72,999-1,18,999 మధ్య ఉన్నాయి.


కొత్తగా విడుదల చేసిన ఎస్‌23 మోడళ్లు

మోడల్‌ ధర

గెలాక్సీ ఎస్‌23 రూ.74,999-79,999
గెలాక్సీ ఎస్‌23+ రూ.94,999-1,04,999
గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా రూ.1,24,999-1,54,999


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు