మార్చిలోపే హిందుస్థాన్‌ జింక్‌లో వాటా విక్రయం

హిందుస్థాన్‌ జింక్‌ (హెచ్‌జడ్‌ఎల్‌)లో తనకున్న వాటాలో కొంత భాగాన్ని మార్చిలోగా ప్రభుత్వం విక్రయించనున్నట్లు దీపమ్‌ (పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ సంస్థ) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 04:14 IST

దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే

దిల్లీ: హిందుస్థాన్‌ జింక్‌ (హెచ్‌జడ్‌ఎల్‌)లో తనకున్న వాటాలో కొంత భాగాన్ని మార్చిలోగా ప్రభుత్వం విక్రయించనున్నట్లు దీపమ్‌ (పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ సంస్థ) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.50,000 కోట్లకు కుదించిన సంగతి తెలిసిందే. హిందుస్థాన్‌ జింక్‌లో కేంద్రానికి 29.54% వాటా ఉంది. 2002లో వేదాంతాకు 26% వాటాను ప్రభుత్వం విక్రయించింది. ఆ తర్వాత మార్కెట్‌ నుంచి మరో 20%, 2003 నవంబరులో ప్రభుత్వం నుంచి మరో 18.92% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా హిందుస్థాన్‌ జింక్‌లో వేదాంతా వాటా 64.92 శాతానికి చేర్చింది. ‘నిధుల సమీకరణ లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. మార్కెట్‌ పరిస్థితులపై అవి ఆధారపడి ఉంటాయి. హిందుస్థాన్‌ జింక్‌ నుంచి నిధుల సమీకరణ కూడా మార్కెట్‌పై ఆధారపడే ఉండొచ్చ’ని పాండే అన్నారు.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌, పీడీఐఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఎన్‌ఎండీసీ స్టీల్‌, బీఈఎమ్‌ఎల్‌లలో వ్యూహాత్మక వాటాలను విక్రయించాలని భావిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు