తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల నవీకరణ

తెలంగాణలోని మల్కాపుర్‌, విష్ణుపురం, ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్‌, ఎర్రగుంట్ల సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న తన పాత ప్లాంట్ల నవీకరణ కోసం ఇండియా సిమెంట్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Published : 04 Feb 2023 01:55 IST

మిగిలిన ప్రాంతాల్లోనివి కూడా
రూ.1,600 కోట్ల కేటాయింపు
ఇండియా సిమెంట్స్‌ వెల్లడి

దిల్లీ: తెలంగాణలోని మల్కాపుర్‌, విష్ణుపురం, ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్‌, ఎర్రగుంట్ల సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న తన పాత ప్లాంట్ల నవీకరణ కోసం ఇండియా సిమెంట్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందుకు రూ.1,500- 1,600 కోట్లు వెచ్చించనున్నట్లు సంస్థ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. సంస్థకు తమిళనాడులోని శంకరనగర్‌, శంకరి, దలవోయి వద్ద తయారీ ప్లాంట్లు, చెన్నై సమీపంలో రెండు గ్రైండింగ్‌ యూనిట్లు, మహారాష్ట్రలోని పార్లి వద్ద మరొకటి ఉన్నాయి. వీటి మొత్తం తయారీ వార్షిక సామర్థ్యం 16 మిలియన్‌ టన్నులుగా ఉంటుంది. పాత ప్లాంట్ల ఆధునికీకరణను తెలంగాణలోని మల్కాపుర్‌, విష్ణుపురం ప్లాంట్లతో ప్రారంభించనున్నట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. శంకరి (తమిళనాడు), బనస్వర (రాజస్థాన్‌) లాంటి కొత్త ప్లాంట్లు ఈ  ప్రణాళికలో లేవు. ప్లాంట్ల ఆధునికీకరణ ప్రక్రియ 15-18 నెలల్లో పూర్తవ్వొచ్చని ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. అక్టోబరు- డిసెంబరులో ఇండియా సిమెంట్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.133.29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్‌లో వాటాను రూ.476.88 కోట్లకు విక్రయించడం వల్ల వచ్చిన లాభాలు కలిసొచ్చాయి. 2021-22 ఇదే కాలంలో లాభం రూ.16.24 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.1,160.63 కోట్ల నుంచి 10.37 శాతం పెరిగి రూ.1,281 కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని