సంక్షిప్త వార్తలు(2)

ముంబయిలో 28 విలాస అపార్ట్‌మెంట్‌లను డీమార్ట్‌ అధిపతి రాధాకృష్ణ దమానీ, కుటుంబ సభ్యులు, సన్నిహితులు రూ.1,238 కోట్లకు కొనుగోలు చేశారు. దేశంలోనే అతిపెద్ద స్థిరాస్తి లావాదేవీల్లో ఇది ఒకటని చెబుతున్నారు.

Updated : 06 Feb 2023 03:55 IST

28 విలాస అపార్ట్‌మెంట్‌లు కొన్న డీమార్ట్‌ దమానీ

దిల్లీ: ముంబయిలో 28 విలాస అపార్ట్‌మెంట్‌లను డీమార్ట్‌ అధిపతి రాధాకృష్ణ దమానీ, కుటుంబ సభ్యులు, సన్నిహితులు రూ.1,238 కోట్లకు కొనుగోలు చేశారు. దేశంలోనే అతిపెద్ద స్థిరాస్తి లావాదేవీల్లో ఇది ఒకటని చెబుతున్నారు. ఇటీవల బడ్జెట్‌లో దీర్ఘకాలిక ఆస్తుల విక్రయం నుంచి వచ్చే మూలధన లాభాలను మళ్లీ పెట్టుబడులు పెట్టడంపై రూ.10 కోట్ల పరిమితి విధించిన నేపథ్యంలో ఈ లావాదేవీ జరగడం గమనార్హం. కొన్ని అపార్ట్‌మెంట్‌లను కంపెనీల పేరుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. మొత్తం కార్పెట్‌ స్థలం 1,82,084 చదరపు అడుగులుగా ఉంది. ఇందులో 101 కార్‌ పార్కింగ్‌లు ఉన్నాయి. ఈ లావాదేవీలు ఫిబ్రవరి 3న రిజిస్టర్‌ అయ్యాయి.


48 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం
సీబీడీటీ ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా

దిల్లీ: సుమారు 48 కోట్ల వ్యక్తిగత శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)లు ఇప్పటి వరకు ఆధార్‌తో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా వెల్లడించారు. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి చివరి తేదీ మార్చి 31గా ఉంది. ఈలోపు అనుసంధానం చేయని పాన్‌లు వ్యాపార, పన్ను సంబంధిత కార్యకలాపాల ప్రయోజనాలు పొందేందుకు అనర్హమవుతాయని నితిన్‌ పేర్కొన్నారు. దేశంలో మొత్తం 61 కోట్ల పాన్‌లను ఇప్పటి వరకూ జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి      రూ.1,000 ఫీజు వసూలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని