వెండి కిందకు!

పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.57,361 కంటే పైన నిలదొక్కుకోకుంటే.. దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోనుండటమే ఇందుకు కారణం.

Published : 06 Feb 2023 02:25 IST

కమొడిటీస్‌
ఈ వారం
బంగారం

సిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.57,361 కంటే పైన నిలదొక్కుకోకుంటే.. దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోనుండటమే ఇందుకు కారణం. ఒకవేళ ఈ స్థాయి కంటే పైకి వెళితే రూ.58,090; రూ.58,885 వరకు రాణిస్తుందని భావించవచ్చు. అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలను ట్రేడర్లు గమనించే అవకాశం ఉంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.15,789 కంటే పైన కదలాడితే సానుకూల ధోరణికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి దిగువన చలిస్తే రూ.15,623కు దిగిరావచ్చు.


వెండి

వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.67,364 దిగువన చలిస్తే.. మరింత కిందకు దిగిరావచ్చు. ఈ స్థాయికి పైన కదలాడితేనే తిరిగి కాంట్రాక్టు పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది.


ప్రాథమిక లోహాలు

* రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈరోజు రూ.771 కంటే పైనే నిలదొక్కుకుంటే... రూ.784; రూ.791 వరకు సానుకూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు.

* సీసం ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.184 దిగువన బలహీనంగా కన్పిస్తోంది. రూ.188 వద్ద స్టాప్‌లాస్‌పెట్టుకొని కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

* జింక్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.300 కంటే పైన కదలాడకుంటే షార్ట్‌ సెల్‌ వైపు మొగ్గు చూపొచ్చు.

* అల్యూమినియం ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.222 దిగువన కదలాడకుంటే లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. ఈ స్థాయికి దిగువన చలిస్తే... దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.


ఇంధన రంగం

* ముడి చమురు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.6,357 కంటే పైన చలించకుంటే... రూ.5,946; రూ.5,866 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.6,357ను మించితే రూ.6,425; రూ.6,715 వరకు రాణిస్తుందని భావించవచ్చు.

* సహజవాయువు ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం రూ.191 కంటే కిందకు రాకుంటే... తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు  ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.7,346 దిగువన చలించకుంటే రూ.7,840 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

* జీలకర్ర ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం రూ.34,415 ఎగువన లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. అదేవిధంగా రూ.33,333 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడమూ మంచిదే.

* ధనియాలు జనవరి కాంట్రాక్టుకు ఈవారం అధిక స్థాయిల వద్ద కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని