పీఎల్‌ఐ పథకంతో రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయ్‌

అంతర్జాతీయ విపణుల్లో దేశీయ తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించిందని నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌ తెలిపారు.

Published : 07 Feb 2023 01:57 IST

3 లక్షల ఉద్యోగాల సృష్టి: నీతిఆయోగ్‌

దిల్లీ: అంతర్జాతీయ విపణుల్లో దేశీయ తయారీ రంగ పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించిందని నీతి ఆయోగ్‌ సీఈఓ పరమేశ్వరన్‌ అయ్యర్‌ తెలిపారు. అలాగే రూ.2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. వాహనం, వాహన విడిభాగాలు, ఫార్మా, టెక్స్‌టైల్స్‌, సోలార్‌ పీవీ మాడ్యూళ్లు సహా దాదాపు 14 రంగాలకు రూ.2 లక్షల కోట్ల నిధుల కేటాయింపు ప్రణాళికతో పీఎల్‌ఐ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పీఎల్‌ఐ పథకం ఫలితాన్నివ్వడం ప్రారంభించింది. ప్రోత్సాహకాల రూపేణ ఇప్పటికే రూ.800 కోట్లు చెల్లించాం. మార్చి కల్లా ప్రోత్సాహకాలు రూ.3000 కోట్లు- 4000 కోట్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నామ’ని అయ్యర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని