తనఖా షేర్లకు రూ.9,200 కోట్లు చెల్లిస్తాం

వచ్చే ఏడాది సెప్టెంబరుతో గడువు తీరిపోయే తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు సుమారు రూ.9,200 కోట్లు (1,114 మి.డాలర్లు) చెల్లించనున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది.

Published : 07 Feb 2023 01:58 IST

ముందస్తుగా విడిపిస్తాం: అదానీ గ్రూపు

దిల్లీ: వచ్చే ఏడాది సెప్టెంబరుతో గడువు తీరిపోయే తనఖా షేర్లను ముందస్తుగా విడిపించేందుకు సుమారు రూ.9,200 కోట్లు (1,114 మి.డాలర్లు) చెల్లించనున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది. ఈ షేర్లు అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లకు చెందినవని పేర్కొంది. మార్కెట్‌లో ఇటీవలి ఒడుదొడుకులను దృష్టిలో ఉంచుకొని తాజా చర్యలను చేపట్టినట్లు అదానీ గ్రూపు తెలిపింది. తనఖా షేర్లను తగ్గించుకోవడానికి ప్రమోటర్లు కట్టుబడి ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనమని  తెలిపింది.

మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కమిటీలో కరన్‌ అదానీ, అనంత్‌ అంబానీ

మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక, ఇతరత్రా అంశాలపై సలహాలు ఇచ్చే కమిటీలో కరన్‌ అదానీ, అనంత్‌ అంబానీలు సభ్యులుగా ఉండనున్నారు. 21 మంది సభ్యులుండే ఈ కమిటీకి టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ సారథ్యం వహిస్తారు. గౌతమ్‌ అదానీ కుమారుడైన కరన్‌ అదానీ.. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌కు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు