కార్లు, బైక్‌లు, ట్రాక్టర్లు అన్నిటిదీ టాప్‌ గేరే

వాహన అమ్మకాల జోరు కొనసాగుతుంది. ప్యాసింజరు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు.. ఇలా అన్ని విభాగాలూ రాణించడంతో.. మొత్తం అమ్మకాలు జనవరిలో 14% మేర పెరిగి 18,26,669కు చేరాయి.

Published : 07 Feb 2023 02:07 IST

జనవరిలో దూసుకెళ్లిన  వాహన విక్రయాలు
14% వృద్ధితో  18 లక్షలకు పైగా నమోదు

దిల్లీ: వాహన అమ్మకాల జోరు కొనసాగుతుంది. ప్యాసింజరు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు.. ఇలా అన్ని విభాగాలూ రాణించడంతో.. మొత్తం అమ్మకాలు జనవరిలో 14% మేర పెరిగి 18,26,669కు చేరాయి. జనవరి 2022లో 16,08,505 వాహనాలు విక్రయమయ్యాయి. త్రిచక్ర వాహనాలు అత్యధికంగా 59% వృద్ధిని సాధించాయి. మొత్తం మీద రిటైల్‌ అమ్మకాలు జనవరిలో వృద్ధి చెందినా.. కరోనా ముందు నెల అయిన జనవరి 2020తో పోలిస్తే 8 శాతం తక్కువగానే ఉన్నాయని వాహన డీలర్ల సంఘాల సమాఖ్య(ఫాడా) ప్రెసిడెంట్‌ మనీశ్‌ రాజ్‌ సింఘానియా పేర్కొన్నారు. ‘ద్విచక్ర వాహనాల అమ్మకాలు మెరుగుపడ్డాయి. నత్తనడక కనిపిస్తున్నా.. ఏడాది కిందటితో పోలిస్తే మేలేన’ని ఆయన అన్నారు. గ్రామీణ మార్కెట్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉందన్నారు. ‘చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వాహన విడిభాగాలు, సెమీకండకర్టర్ల అంతర్జాతీయ సరఫరా కూడా రాణిస్తోంది. భవిష్యత్‌లో వాహనాల కోసం వేచిచూసే సమయం తగ్గే అవకాశం ఉంది. ఇది ప్యాసింజరు వాహనాల విభాగం మరింతగా దూసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంద’ని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు