బ్రోకరేజీలు నిఘా వ్యవస్థనుఏర్పాటు చేసుకోవాలి

మార్కెట్‌లో మోసాలను గుర్తించేందుకు, నియంత్రించేందుకు నిఘా, నియంత్రణ వ్యవస్థలను స్టాక్‌ బ్రోకర్లు ఏర్పాటు చేసుకోవాలని సెబీ ప్రతిపాదించింది.

Published : 08 Feb 2023 01:52 IST

సెబీ ప్రతిపాదన

దిల్లీ: మార్కెట్‌లో మోసాలను గుర్తించేందుకు, నియంత్రించేందుకు నిఘా, నియంత్రణ వ్యవస్థలను స్టాక్‌ బ్రోకర్లు ఏర్పాటు చేసుకోవాలని సెబీ ప్రతిపాదించింది. మార్కెట్‌ మోసాల నియంత్రణకు సంబంధించి బ్రోకర్లను జవాబుదారీ చేసేలా ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేవు.  నిఘా వ్యవస్థల ఏర్పాటు ద్వారా మోసాలను గుర్తించే విషయంలో బ్రోకరేజీ సంస్థలు, వాటి ఉన్నత యాజమాన్యాన్ని జవాబుదారీ చేస్తూ చర్చాపత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఫిబ్రవరి 23 వరకు అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. బ్రోకరేజీ సంస్థలు ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు నిఘా పెట్టాల్సిన మోసాల జాబితాను కూడా ఇందులో పేర్కొంది. ట్రేడింగ్‌ను తప్పుదోవ పట్టించడం, ధరల్లో అవకతవకలు, ఫ్రంట్‌ రన్నింగ్‌, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, మిస్‌- సెల్లింగ్‌ లాంటివి ఇందులో ఉన్నాయి. బ్రోకరేజీ సంస్థల క్లయింట్లు, ప్రమోటర్లు, ఉద్యోగులు, అధీకృత వ్యక్తులు పాల్పడే మోసాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని నియంత్రించే వ్యవస్థలకు చేరవేయడంలో బ్రోకరేజీ సంస్థల సీఈఓ, ఎండీ, కీలక యాజమాన్య ఉద్యోగులు, డైరెక్టర్లు జవాబుదారీగా ఉండాలని సెబీ సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని