24 నుంచి శామ్‌సంగ్‌ ఎస్‌23 ఫోన్ల డెలివరీ

ప్రీమియం ఫోన్ల విభాగంలో 70 శాతం వృద్ధి లభిస్తోందని శామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ గుప్తా తెలిపారు.

Published : 08 Feb 2023 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీమియం ఫోన్ల విభాగంలో 70 శాతం వృద్ధి లభిస్తోందని శామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ గుప్తా తెలిపారు. తాజాగా ఆవిష్కరించిన గెలాక్సీ ఎస్‌23 మొబైల్స్‌ కోసం గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 1,40,000 ప్రీ-బుకింగ్‌లు వచ్చాయని తెలిపారు. మంగళవారం ఎస్‌23 మొబైల్‌ ఫోన్లను హైదరాబాద్‌ విపణిలోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటికే బుకింగ్‌ చేసిన వారికి ఈ ఫోన్లను ఈ నెల 24 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు.  ఏడు మోడళ్లలో లభిస్తున్న గెలాక్సీ ఎస్‌23 ఫోన్ల ధరల శ్రేణి రూ.74,999 నుంచి రూ.1,54,999 వరకు ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు