కెనరా బ్యాంక్‌ ఎండీగా సత్యనారాయణ రాజు

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మంగళవారం (ఈనెల 7) నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు  వెల్లడించింది.

Published : 08 Feb 2023 01:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మంగళవారం (ఈనెల 7) నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు  వెల్లడించింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ అయిన రాజు 1988లో విజయా బ్యాంకులో చేరారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పని చేశారు. అదే బ్యాంకులో శివమొగ్గ, విజయవాడ, హైదరాబాద్‌, ముంబయిలకు ప్రాంతీయ అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. తరవాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో అతిపెద్ద జోన్‌ అయిన ముంబయి జోనల్‌ హెడ్‌గా ఆయన పనిచేశారు. అదే బ్యాంకులో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయికి చేరారు. బీఓబీ ప్రధాన కార్యాలయంలో సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగానూ పనిచేశారు. తదుపరి 2021 మార్చి 10న కెనరా బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. బ్రాంచ్‌ బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌ క్రెడిట్‌, అగ్రి ఫైనాన్సింగ్‌, క్రెడిట్‌ మానిటరింగ్‌, క్రెడిట్‌ రికవరీ తదితర విభాగాల్లో సత్యనారాయణ రాజుకు మంచి అనుభవం ఉంది. బ్యాంకింగ్‌ సేవలు, ఉత్పత్తుల డిజిటలీకరణలోనూ ఆయన తన వంతు పాత్ర పోషించారు.

* కెనరా బ్యాంక్‌ కొత్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా హర్దీప్‌ సింగ్‌ అహ్లువాలియా నియమితులయ్యారని బ్యాంకు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈయన ఇండియన్‌ బ్యాంక్‌లో రికవరీ విభాగంలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని