ఎల్ అండ్‌ టీకి రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డరు

లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ)కి భారత రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డరు లభించింది. దేశీయంగా 41 మాడ్యులర్‌ వంతెనలను, తయారు చేసి, అందించేందుకు ఎల్‌ అండ్‌ టీ కంపెనీతో రూ.2,585 కోట్ల కాంట్రాక్టును రక్షణ శాఖ కుదుర్చుకుంది.

Updated : 09 Feb 2023 11:38 IST

దిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ)కి భారత రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డరు లభించింది. దేశీయంగా 41 మాడ్యులర్‌ వంతెనలను, తయారు చేసి, అందించేందుకు ఎల్‌ అండ్‌ టీ కంపెనీతో రూ.2,585 కోట్ల కాంట్రాక్టును రక్షణ శాఖ కుదుర్చుకుంది. ఈ వంతెనలను విడివిడి భాగాలు(మాడ్యూళ్లు)గా రూపొందిస్తారు. తద్వారా క్షేత్ర స్థాయిలో వేగంగా వంతెనగా నిర్మించడానికి వీలవుతుంది. వీటిని డీఆర్‌డీఓ డిజైన్‌ చేసి, అభివృద్ధి పరచగా.. ఎల్‌ అండ్‌ టీ  తయారు చేస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత సైనిక దళంలో ఈ వంతెనలను ఉపయోగించనున్నారు. ప్రతి వంతెన 46 మీటర్ల పొడవునా తయారు చేయొచ్చు. కాల్వలు, పెద్ద కందకాలున్న చోట కూడా ఈ వంతెనలను వేగంగా అమర్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని