అదానీ హైడ్రోజన్‌ ప్లాంటులో పెట్టుబడుల నిర్ణయం వాయిదా: టోటల్‌

అదానీ గ్రూపు ఏర్పాటు చేయనున్న 50 బిలియన్‌ డాలర్ల హైడ్రోజన్‌ ప్లాంటులో భాగస్వామిగా చేరాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ వెల్లడించింది.

Published : 09 Feb 2023 02:33 IST

దానీ గ్రూపు ఏర్పాటు చేయనున్న 50 బిలియన్‌ డాలర్ల హైడ్రోజన్‌ ప్లాంటులో భాగస్వామిగా చేరాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ వెల్లడించింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ అదానీ గ్రూప్‌పై ఆరోపణల నేపథ్యంలో, ప్రత్యేక ఆడిట్‌ ప్రారంభించామని.. అందులో స్పష్టత వచ్చాకే హైడ్రోజన్‌ ప్లాంటులో భాగస్వామిగా చేరడంపై  నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అదానీ గ్రూపులో టోటల్‌ఎనర్జీస్‌కు 3.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. హైడ్రోజన్‌ ప్లాంటు కోసం అదానీ గ్రూపుతో భాగస్వామాన్ని కుదుర్చుకుంటున్నట్లు గతేడాది జూన్‌లో టోటల్‌ ఎనర్జీస్‌ ప్రకటించింది. అయితే.. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయలేదని కంపెనీ సీఈఓ ప్యాట్రిక్‌ పౌయానే తెలిపారు.

నేటి బోర్డు సమావేశాలు: అరబిందో ఫార్మా, కిమ్స్‌, నాట్కో ఫార్మా, రెయిన్‌బో హాస్పిటల్స్‌, ఎల్‌ఐసీ, లుపిన్‌, ఎంఆర్‌ఎఫ్‌, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌, ఎస్‌ఎంఎస్‌ ఫార్మా, బజాజ్‌ కన్జూమర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు