ఆర్పు రూ.300 స్థాయిలకు చేరితేనే పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం

టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీలకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రావాలంటే.. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) నెలకు రూ.300 స్థాయికి చేరడం కీలకమని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు.

Published : 09 Feb 2023 02:34 IST

ఎయిర్‌టెల్‌ సీఈఓ

దిల్లీ: టెలికాం నెట్‌వర్క్‌ కంపెనీలకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం రావాలంటే.. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) నెలకు రూ.300 స్థాయికి చేరడం కీలకమని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ తెలిపారు. ఇది త్వరలోనే జరుగుతుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. వైవిధ్యభరిత పోర్ట్‌ఫోలియో, అధిక వ్యాపారావకాశాలున్న గ్రామాలపై దృష్టి, అత్యుత్తమ 150 నగరాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడం లాంటివి ఎయిర్‌టెల్‌ భవిష్యత్‌ వ్యూహాలని తెలిపారు. హరియాణా, ఒడిశా అనంతరం 17 సర్కిళ్లలో ప్రారంభ స్థాయి ప్రీపెయిడ్‌ టారిఫ్‌ను రూ.99 నుంచి రూ.155కు భారతీ ఎయిర్‌టెల్‌ పెంచింది. అక్టోబరు- డిసెంబరులో భారతీ ఎయిర్‌టెల్‌ ఆర్పు రూ.163 నుంచి రూ.193కు పెరిగింది. టారిఫ్‌ల పెంపు ఒకే రీతిలో లేవని.. ఒకవేళ తాము అలా చేస్తే మార్కెట్‌ వాటాను కోల్పోవాల్సి వస్తుందని గోపాల్‌ తెలిపారు. అదే జరిగితే మళ్లీ మార్కెట్‌ వాటాను తిరిగి సంపాదించుకోవడం కష్టం అవుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని