IT Returns: ఏప్రిల్‌ 1 నుంచే రిటర్నులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

Updated : 16 Feb 2023 10:13 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ బుధవారం వెల్లడించింది.

గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపింది. వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన 1-6 వరకు ఐటీఆర్‌ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌) ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అనివార్య సందర్భాల్లో సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తూ ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు