Higher pension: అందుబాటులోకి అధిక పింఛను ఆన్‌లైన్‌ దరఖాస్తు.. మే 3 వరకు గడువు

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది.

Updated : 27 Feb 2023 10:03 IST

ఆదివారం అర్ధరాత్రి ‘ఉమ్మడి ఆప్షన్‌’ లింక్‌ ఇచ్చిన ఈపీఎఫ్‌వో

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం -1995 చట్టసవరణకు ముందుగా  (2014 సెప్టెంబరు 1కి ముందు) ఈపీఎఫ్‌ చందాదారుగా చేరి, ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందాచెల్లిస్తూ ఈపీఎస్‌ చట్టంలోని పేరా నం.11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారు అర్హులని పేర్కొంది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు గడువు మే 3గా పేర్కొంది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్‌ నమోదు చేయాలని స్పష్టం చేసింది.

ఆప్షన్‌ ఇలా: వేతనజీవులు, పింఛనుదారులు ఈపీఎఫ్‌ మెంబర్‌పోర్టల్‌ హోంపేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్‌వో ఆదివారం అర్ధరాత్రి ఏర్పాటు చేసింది. హోంపేజీలో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ లింకును క్లిక్‌ చేయాలి. ఆ తరువాత ఈపీఎస్‌ చట్టం 11(3) కింద ఆప్షన్‌కు దరఖాస్తును క్లిక్‌ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్‌ అకౌంట్‌ నంబరు (యూఏఎన్‌) ఖాతాద్వారా పూర్తిచేయాలి. చందాదారు ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్‌వో రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌నంబరు ఉండాలి. 4దశల్లో వివరాలు పూర్తిచేశాక దరఖాస్తు నంబరు వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని