Medicines: 74 మందులకు రిటైల్‌ ధరలు ఖరారు: ఎన్‌పీపీఏ

జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందులకు రిటైల్‌ ధరలను నిర్ణయించింది. ఈ నెల 21న జరిగిన 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated : 28 Feb 2023 08:43 IST

దిల్లీ: జాతీయ మందుల ధరల నిర్ణాయక సంస్థ (ఎన్‌పీపీఏ) 74 మందులకు రిటైల్‌ ధరలను నిర్ణయించింది. ఈ నెల 21న జరిగిన 109వ ఎన్‌పీపీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధుమేహ వ్యాధి చికిత్సలో వినియోగించే డాపాగ్లిఫ్లోజిన్‌ సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌ హెచ్‌సీఎల్‌ (ఈఆర్‌) ట్యాబ్లెట్‌కు రూ.27.75 ధర; రక్తపోటును అదుపు చేయటానికి వినియోగించే టెల్మిసార్టాన్‌, బిసోప్రొలోల్‌ ఫ్యూమరేట్‌ ట్యాబ్లెట్‌కు రూ.10.92 ధర నిర్ణయించారు. మరో 80 ఔషధాలకు గరిష్ఠ ధర (సీలింగ్‌ ప్రైస్‌)లనూ ఎన్‌పీపీఏ నిర్ణయించింది. మూర్ఛ, నూట్రోపెనియా వ్యాధి ఔషధాలు ఇందులో ఉన్నాయి. సోడియమ్‌ వాల్‌ప్రొయేట్‌- 200 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.3.20, ఫిల్‌గ్రాస్టిమ్‌ ఇంజెక్షన్‌ (ఒక వయల్‌)కు రూ.1,034.51 ధర ఖరారు చేశారు. స్టెరాయిడ్‌ తరగతికి చెందిన ఔషధం హైడ్రోకార్టిసోన్‌- 20 ఎంజీకి రూ.13.28 గరిష్ఠ ధర నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని