గేర్లతో విద్యుత్‌ బైక్‌

గేర్లతో కూడిన విద్యుత్‌ బైకు ‘ఎరా’ను అంకుర సంస్థ మ్యాటర్‌ ఆవిష్కరించింది.

Published : 02 Mar 2023 02:50 IST

‘ఎరా’ను ఆవిష్కరించిన మ్యాటర్‌

హైదరాబాద్‌(రాయదుర్గం), న్యూస్‌టుడే: గేర్లతో కూడిన విద్యుత్‌ బైకు ‘ఎరా’ను అంకుర సంస్థ మ్యాటర్‌ ఆవిష్కరించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బైకును విడుదల చేసిన సందర్భంగా సంస్థ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ కుమార్‌ ప్రసాద్‌ తెలికేపల్లి మాట్లాడుతూ.. పూర్తి దేశీయ సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునేలా గేర్లు, స్పోర్టీ లుక్‌తో దీన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని తమ అభివృద్ధి, పరిశోధన కేంద్రంలో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. నెలకు 60,000 వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బైకు కోసం ఆవిష్కరించిన ఉత్పత్తుల్లో 100కు పైగా పేటెంట్‌ దరఖాస్తులు చేసినట్లు పేర్కొన్నారు. మ్యాటర్‌ ఎరా 4000, ఎరా 5000, ఎరా 5000+, ఎరా 6000+ మోడళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రూ.1,43,999 నుంచి రూ.1,53,999 వరకూ వీటి ధర ఉంటుందని తెలిపారు. త్వరలోనే ముందస్తు బుకింగ్‌లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాటరీలు, మోటార్‌ వేడెక్కకుండా యాక్టివ్‌ లిక్విడ్‌ కూల్‌ సాంకేతికత, ఎక్కడైనా సులభంగా ఛార్జింగ్‌ చేసుకునే వీలు, ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌, యాక్సిడెంట్‌ డిటెక్షన్‌ తదితరాలున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని