Nirmala Sitharaman: ప్రతీది అమ్మేయాలనే తొందర ప్రభుత్వానికి లేదు: నిర్మలా సీతారామన్
ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థనూ అమ్మేయాలనే తొందర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికాం సహా నాలుగు వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీస వాటాను ప్రభుత్వం అట్టేపెట్టుకుంటుందని పేర్కొన్నారు.
దిల్లీ: ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థనూ అమ్మేయాలనే తొందర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికాం సహా నాలుగు వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీస వాటాను ప్రభుత్వం అట్టేపెట్టుకుంటుందని పేర్కొన్నారు. మిగతా వ్యూహాత్మక రంగాల్లోని ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటీకరించడం లేదా మరో ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం లేదా మూసేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ యాజమాన్య నియంత్రణను కొనసాగించనున్న నాలుగు వ్యూహాత్మక రంగాల్లో టెలికాంతో పాటు అణువిద్యుత్, స్పేస్, రక్షణ; రవాణా, టెలికమ్యూనికేషన్స్; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలు ఉన్నాయి.
‘ప్రతి ఒక్కటీ అమ్మేయాలనే తొందర ప్రభుత్వానికి లేదు. అలాగని గుండు సూది దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిని తయారు చేసే వ్యాపారాలన్నింటినీ ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పడం లేదు. ఎక్కడ అవసరం లేదో.. వాటినే వద్దనుకుంటున్నాం. టెలికాం లాంటి వ్యూహత్మక ప్రయోజనాలు ఉన్న చోట్ల వ్యాపారాలను కొనసాగిస్తాం’ అని ఆమె తెలిపారు.
కనీస వాటాను కొనసాగించాలని భావిస్తున్న కొన్ని కీలక రంగాలపై మాట్లాడుతూ.. ‘సొంతంగా వాటంతట అవే కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఉన్న పెద్ద సంస్థలు యథాతథంగానే కొనసాగుతాయి. కానీ చిన్న పరిమాణంలో వ్యాపారాలను నిర్వహించలేని స్థాయిలో ఉన్న వాటిని.. వేరే సంస్థలో విలీనం చేసి వాటా పరిమాణాన్ని పెంచుతాం. తద్వారా వాటి అవసరాలను ఆ సంస్థలే తీర్చుకునేలా తయారుచేస్తామ’ని ఆమె వివరించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.51,000 కోట్లను సమీకరించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి